కాంగ్రెస్‌ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి… రైతులు అరేబియా సముద్రంలోకి : కేసీఆర్

-

ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని.. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే దళారీల రాజ్యం వస్తుందని.. కాంగ్రెస్‌ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి… రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్తారని అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని చెప్పారు. రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ దుబారా అని రేవంత్‌రెడ్డి అంటున్నారని.. కాంగ్రెస్‌ గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారని తెలిపారు.

“రైతు బంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌. దుర్మార్గపు కాంగ్రెస్‌ను రైతులు మట్టి కరిపించాలి. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్‌. 1969లో 400 మంది ఉద్యమకారులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాల్చి చంపింది. వందల మందిని పొట్టనపెట్టుకుని కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో సైతం 24 గంటల కరెంట్‌ ఇవ్వట్లేదు. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి.” అని కేసీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news