కాసేపటి క్రితమే ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన ఎంతో ఉత్కంఠను కలిగించే సెమి ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. లీగ్ దశలో వరుసగా తొమ్మొది మ్యాచ్ లను గెలుచుకుని ఇండియా మొదటి స్థానంతో దర్జాగా సెమీఫైనల్ చేరింది. ఇక న్యూజిలాండ్ మాత్రం ఆఖరి మ్యాచ్ లో గెలిచి నాలుగవ జట్టుగా సెమిఫైనల్ కు చేరుకుంది. ఇక వాంఖడే స్టేడియం లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ ఎంచుకుని సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ? గతంలో జరిగిన వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ప్రత్యర్థులను ఓడించింది. అంతెందుకు ఇండియా కప్ గెలిచిన 2011 లోనూ మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్థిని ఓడించింది.
కానీ ఆ తర్వాత జరిగిన 2015 మరియు 2019 వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో మాత్రం మొదట బౌలింగ్ చేసి ఓడిపోయింది. ఆ లెక్కన చూస్తే ఈ మ్యాచ్ లోనూ ఇండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.