నిర్మల్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని తెలిపారు. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని.. పదేళ్లు బీఆర్ఎస్‌ను ఆశీర్వదించారని అన్నారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా కావాలని ఇంద్రకరణ్‌రెడ్డి తపనపడ్డారని తెలిపారు. నిర్మల్‌కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఏనాడైనా అనుకున్నామా? అని అన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి మెజారిటీ 80 వేలు దాటాలని కోరారు.
‘పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాం. దేశంలోనే మొదటిసారిగా దళిత బంధు స్కీమ్ తెచ్చాం. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. నష్టం వచ్చినా రైతుల వద్ద పంట కొంటున్నాం. ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్ అంటున్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయి. ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది:. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. అభివృద్ధి కొనసాగాలంటే.. మళ్లీ బీఆర్ఎస్ గెలవాలి.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.