ఇవాళ సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటన..షెడ్యూల్ ఇదే

-

సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించునున్నారు. ఇవాళ ఉదయం సూర్యాపేట జిల్లాకు బయలు దేరనున్నారు సీఎం కేసీఆర్‌. ఇందులో భాగంగానే.. 11.15కు సూర్యాపేటకు చేరుకోనున్నారు సీఎం కేసిఆర్. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.

ముఖ్యంగా మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, జిల్లా పోలీస్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, నూతన కలెక్టరేట్ భవనంను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటుచేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో 3,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news