డబ్బు సంపాదించడం, డబ్బున్నోళ్లకు అండగా నిలవడం, ప్రజల బాధలను పట్టించుకోకపోవడమే KCR సర్కార్ ముఖ్య ఉద్దేశమని BJP స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘పదో నిజాం KCR.. రాజ్యసభ సీట్లు డబ్బున్నోళ్లకే ఇస్తడు. ఏడుగురు BRS MPల ఆస్తుల విలువ రూ.5,596Cr. UP, MPలో ఉన్న 41 మంది MPల ఆస్తుల విలువ BRS MPల ఆస్తిలో సగం కంటే తక్కువ. TSలో దోపిడీ ఏ స్థాయిలో సాగుతుందో చెప్పేందుకు ఇదో మచ్చుతునక మాత్రమే’ అని అన్నారు. ఇది ఎలా ఉంటె జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందే దిశా మీటింగ్కు తేదీ నిర్ణయించినా జీహెచ్ఎంసీ అధికారులు హాజరుకాకపోవడంపై సీరియస్ అయ్యారు. దిశా సమావేశం ఉన్నా స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా పెట్టుకుంటారని అధికారులను కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఆర్వోబీ నిర్మాణానికి తాము ఒప్పుకున్నా జీహెచ్ఎంసీ మాత్రం సహకరించడం లేదని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు రైల్వేశాఖ అధికారులు.రెండు రోజుల ముందు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమం పెట్టుకుని.. దిశా సమావేశానికి డుమ్మా కొడుతారా..? అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సమావేశానికి హాజరుకాని అధికారుల తీరును తప్పుపట్టారు. జీహెచ్ఎంసీ సహకారం లేని కారణంగా పనులన్నీ పెండింగ్లో పడుతున్నాయన్నారు. దిశా సమావేశంలో సమాధానాలు చెప్పేవారు కూడా లేరన్నారు. ఆర్వోబీ నిర్మాణ పనులు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉన్నా.. తగిన సహకారం లేకపోవడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు.