మరికాసేపట్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

-

మరి కాసేపట్లో యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్ల పాలెం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. 2014 లో దీనికి స్థల సేకరణ చేశారు. ఇక 2015 జూన్ 8న లో థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేసి.. 2017 అక్టోబర్ లో పనులు ప్రారంభించారు.

4 వేల మెగావాట్ల కెపాసిటీతో ప్లాంట్ నిర్మాణం ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.29,995 కోట్ల రూపాయల వ్యయ అంచనాతొ ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు.(ఒక్కొక్క మెగావాటుకు ఏడు కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా). ఇందుకోసం 4200 ఎకరాల భూమిని సేకరించింది ప్రభుత్వం. మొత్తం 5 యూనిట్ల ద్వారా 4వేల మెగావాట్ల వైద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక చేపట్టారు. ఒక్కొక్క యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

వచ్చే ఏడాది సెప్టెంబర్ లోగా మొదటి యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా పనులు వేగవంతం చేశారు. డిసెంబర్ లో రెండో యూనిట్ లో మరో 8 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం అవుతుంది. 2024 చివరి నాటికి పూర్తిస్థాయిలో ధర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులు పూర్తిచేసుకుని విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ బెల్ యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version