రంజాన్‌ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి : సీఎం కేసీఆర్

-

నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. జంట నగరాల్లో ముఖ్యంగా చార్మినార్‌ పరిసర ప్రాంతాల ముస్లింలు గురువారం పవిత్ర రంజాన్‌ మాసం ఆరంభ వేడుకలు చేసుకున్నారు. చరిత్రాత్మక మక్కా మసీదుతోపాటు చార్మినార్‌, నిజామియా యునానీ ఆయుర్వేద ఆసుపత్రి భవనం కట్టడాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. సంప్రదాయం ప్రకారం రాత్రి 9.00 గంటలకు మక్కా మసీదులో సామూహిక తరావీ నమాజ్‌ను ఆ మసీదు కతీబ్‌ మౌలానా హఫీజ్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కురేషి నిర్వహించారు. రంజాన్‌ ఉపవాస దీక్షలు (రోజా) ఇవాళ తెల్లవారుజామున సహర్‌తో ప్రారంభమై.. 30 రోజులపాటు కొనసాగనున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్.. నెలవంక దర్శనంతో ప్రారంభమైన పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని కేసీఆర్‌ తెలంగాణ సహా దేశంలోని ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన ఈ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి.. ఆదర్శవంతమైన జీవనం దిశగా ప్రేరణనిస్తుందని సీఎం పేర్కొన్నారు. రంజాన్‌ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని.. జనమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news