విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ ల గౌరవ వేతనం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రూ.3900 నుంచి రూ.5వేలకు వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. అదనపు సాయం రూ.3వేలతో కలిసి మొత్తంగా నెలకు వీరు రూ.8వేలు అందుకోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 17,608 మంది వీఓఏలకు చేకూరనుంది.
అయితే.. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా… ఇకపై వారంతా నెలకు రూ. 8,000 జీతం అందుకొనున్నారు. సెప్టెంబర్ నెల నుంచి పెరిగిన జీతం అమల్లోకి రానుండగా… వారి యూనిఫామ్ ల కోసం ఏడాదికి రూ. 2కోట్ల నిధులు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అటు వీరికి జీవిత బీమా పథకాన్ని కూడా అమలుచేసే విధానాన్ని కూడా పరిశీలించాలని మంత్రి ఎర్రబెల్లిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.