రంగారెడ్డి జిల్లా మంచి రేవులలో నిర్మించబోయే ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ కు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా లోని మంచిరేవుల వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి స్థలాన్ని కేటాయించింది.
ఈ స్థలంలో నిర్మించ తలపెట్టిన స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, భవన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-5వ తరగతులతో ఈ స్కూల్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ.. డిగ్రీ వరకు నాణ్యమైన, అత్యుత్తమ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యను అందించనున్నారు.