బంగాళాఖాతంలో తుఫాన్ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బంగాళాఖాతంలో బలపడే తుఫాన్ సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ కాన్ఫరెన్స్ నిర్వహించగా ఇందులో కేంద్ర కార్యదర్శులు, డిఫెన్స్ , డిజి ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, డిజి ఐఎండి పాల్గొన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఏపీ నుంచి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు.
పాల్గొన్న హెచ్చరిక సందర్భంగా తీసుకున్న ముందస్తు చర్యలను వివరించిన స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా.. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసారు. అత్యవసర సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసాము. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించాము. ప్రజలను అవరమైతే సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసాం. విద్యుత్ ఆటంకం కలిగితే వెంటనే పునరుద్ధించడానికి అందుబాటులో సిబ్బంది ఉన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి వాతావరణ పరిస్థితి ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేస్తూ.. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అమలు చేయాలని అధికారులకు సూచించారు ఆర్పీ సిసోడియా.