ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,11,321 మందికి కొత్తగా రేషన్ కార్డుల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. 2023 ఆగస్టు-డిసెంబర్ వరకు అర్హులై.. పొందని వారిని తాజాగా అర్హుల జాబితాలో చేర్చి కార్డులు అందించారు. అదేవిధంగా 1.17 లక్షల మందికి కొత్త పెన్షన్లు, 6,314 మందికి హెల్త్ కార్డులను, 34వేల మందికి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందించింది.
దాదాపు 55 నెలల్లోనే DBT ద్వారా రూ.2.46 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు ప్రవేశపెడుతుంటే.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ప్రభుత్వం పై విమర్శలు చేస్తుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబు కుల పత్రిక ఈనాడులో అయితే పిచ్చిరాతలు రాస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. అర్హత ఉన్న ఏ లబ్దిదారుడు కూడా సంక్షేమ పథకాలను మాత్రం మిస్ కాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపజేయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమాన్నిఅమలు చేస్తున్నామని తెలిపారు.