బతుకమ్మ వేడుకల షెడ్యూల్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి 9వ తేదీ వరకు రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలు.. 10న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. లేజర్ షో కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.
10న అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్ వరకు వెయ్యి బతుకమ్మలతో ర్యాలీ ఉంటుంది. ఈ మేరకు బతుకమ్మ వేడుకల షెడ్యూల్ విడుదల చేసింది సర్కార్.