తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తినే ఒక క్రిమినల్ – కేటీఆర్

-

 

తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తినే ఒక క్రిమినల్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ… ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదని మండిపడ్డారు. ఆయన ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.. అధికారం ఆయన చేతిలో ఉంది.. ఎవరిపైన అయినా నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చన్నారు కేటీఆర్.

కాళేశ్వరం కట్టిందే మేము అయినప్పుడు చూడాల్సింది మేము కాదు… కాంగ్రెస్ పార్టీనే… కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఈరోజు దేశానికి తెలంగాణ ధాన్యాదారంగా నిలుస్తున్నది. దేశానికి అన్నపూర్ణగా మారిందని చెప్పారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు విజయం గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు… ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సరిచేయాలి… ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉందన్నారు. మేడిగడ్డ వద్ద జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అంటూ రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news