కాళేశ్వరం కట్టిందే KCR..అక్కడికి వెళ్లి చూడాల్సింది కాంగ్రెస్ – కేటీఆర్

-

కాళేశ్వరం కట్టిందే KCR..అక్కడికి వెళ్లి చూడాల్సింది కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. మేడిగడ్డ కట్టిందే KCR గారు… కాళేశ్వరం లో రేవంత్ కు ఓనమాలు కూడా తెలవదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్…కాళేశ్వరం కట్టిందే మేము …కాళేశ్వరం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకపోతే తెలుసుకోవచ్చు అని చురకలు అంటించారు.

KTR-Revanth

కాళేశ్వరం కట్టిందే మేము అయినప్పుడు చూడాల్సింది మేము కాదు… కాంగ్రెస్ పార్టీనే… కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఈరోజు దేశానికి తెలంగాణ ధాన్యాదారంగా నిలుస్తున్నది. దేశానికి అన్నపూర్ణగా మారిందని చెప్పారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు విజయం గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు… ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సరిచేయాలి… ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉందన్నారు. మేడిగడ్డ వద్ద జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అంటూ రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news