ఏపీలో సరైన రోడ్లు లేక గర్భిణులు చనిపోతున్నారని జగన్ సర్కార్ కు వైస్ షర్మిల చురకలు అంటించారు. ఆదివాసీలు అంటే YSR కి ఎంతో అభిమానం. 20 లక్షల ఎకరాల పొడు భూములకు పట్టాలిచ్చారన్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు.జీవో 3 రద్దుతో ఆదివాసీల హక్కులు హరించ బడ్డాయని మండిపడ్డారు. వారి ఉద్యోగాలు వారికి రాకుండా పోయాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీఓ 3 ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయినా సరే గిరిజనుల పక్షాన పోరాడుతాం. 1/70 యాక్ట్ విషయంలో గిరిజనుల పక్షాన మా పోరాటం ఉంటుంది.జగనన్న ప్రభుత్వానికి బాక్సైట్ తవ్వకాల మీద ఉన్న శ్రద్ధ గిరిజనుల అభివృద్ధి మీద లేదని వైస్ షర్మిల విమర్శలు చేశారు.బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు కానీ గిరిజనుల జీవన ప్రాంతాల్లో మాత్రం కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేదు. సరైన రోడ్లు లేక గర్భిణులు చనిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సరైన న్యాయం చేస్తామని ప్రకటన చేశారు వైస్ షర్మిల.