సియోల్ లో బిజీగా సీఎం రేవంత్.. LS గ్రూప్‌ ప్రతినిధులతో భేటీ

-

పదిరోజుల పాటు అమెరికాలో పర్యటించి 19 కంపెనీలతో సమావేశమై రాష్ట్రానికి రూ.31,532 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీమ్. ఇక ఆదివారం రోజున యూఎస్ టూర్ ముగించుకొని దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకుంది. సియోల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వేట మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఎల్ఎస్ గ్రూప్‌ ప్రతినిధులతో సమావేశమైంది.

గతంలో LG గ్రూప్లో భాగమైన LS కార్ప్‌ ఛైర్మన్‌ “కూ జా యున్‌”తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన LS కార్ప్‌ బృందం… త్వరలో రాష్ట్రంలో పర్యటించేందుకు అంగీకరించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  మరోవైపు ఎల్ఎస్ గ్రూప్తో భేటీ అనంతరం సీఎం రేవంత్ అండ్ టీమ్.. కొరియా టెక్స్ టైల్ పరిశ్రమ సమాఖ్యతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం కోరగా కొరియా బృందం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news