RS ప్రవీణ్‌కుమార్‌కు మంచి ఆఫర్ ఇచ్చానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. Rs ప్రవీణ్ కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇస్తా అన్నా…ఆయన వద్దు అన్నారని పేర్కొన్నారు. సమాజానికి చాలా చేసేది ఉంది అని అన్నారు…Rs మీద నాకు గౌరవం ఉందని వెల్లడించారు. వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు.
కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దించారన్న ఆయన నిజాం నకలునే కేసీఆర్ చూపించారని విమర్శించారు. హైదరాబాద్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఏనాడు ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ గౌరవించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యాయన్న ఆయన ధర్నాచౌక్‌లో నిరసనలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు.