మూసీ సుందరీకరణే లక్ష్యంగా.. దుబాయ్ లో 70 సంస్థలతో సీఎం రేవంత్‌ చర్చలు

-

మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మూసీ రివర్‌ ఫ్రంట్‌ నిర్మించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. మూసీ నదిలో నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు.. పరీవాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం.. తదితర దీర్ఘకాలిక ప్రణాళికలపై సీఎం రేవంత్ తన బృందం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ టీమ్ లండన్‌లో థేమ్స్‌ రివర్‌ ఫ్రంట్‌ను, దుబాయ్‌లో వాటర్‌ ఫ్రంట్‌ను సందర్శించి వాటిని అభివృద్ధి చేసిన విధానాలను తెలుసుకుంది. తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవానికి వాటిని వర్తింపజేయడంపై అక్కడి అధికారులతో చర్చించింది.

లండన్‌ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టీమ్ ఆదివారం దుబాయ్‌లోనూ ఇదే అంశంపై సుమారు 70 సంస్థలతో చర్చలు జరిపింది. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, ప్రపంచ స్థాయి పట్టణ ప్రణాళిక నిపుణులు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ ప్లాన్‌ డెవలపర్లు, ఆర్కిటెక్చర్‌ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో వరుసగా భేటీ అయి హైదరాబాద్‌ మూసీ రివర్‌ ఫ్రంట్‌ డిజైన్లు, అభివృద్ధిపై సమాలోచనలు చేశారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం, హైదరాబాద్‌లో మూసీ అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టుపై ఆసక్తి ప్రదర్శించాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version