సబితమ్మ నీది..నీ కొడుకుల ఫాం హౌసులు కూలగొట్టుడే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్…అనంతరం మాట్లాడారు. కేటీఆర్…..జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. హరీశ్ రావు….అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నించారు.
సబితమ్మ పేద అరుపులు వద్దూ……నీకున్న ఫాంహౌస్ ల లెక్కలు కూడా ఉన్నాయని తెలిపారు. మీ ఫాంహౌస్ లు ఎక్కడ కూలిపోతాయోనని భయపడి పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ మీరు కట్టుకున్న ఫాంహౌస్ ల నుంచి వచ్చే మురికి నీటి హైదరాబాద్ ప్రజలు తాగాలా…..? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు సీఎం రేవంత్ రెడ్డి.