తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని గడీల్లో ఉండలేదు : సీఎం రేవంత్

-

రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నామని, అందుకే చిహ్నంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ తల్లి అంటే.. మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలని చెప్పారు.

తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదని, తెలంగాణ తల్లి అంటే గడీలో ఉండే వాళ్లు కాదని తెలిపారు. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. మరోవైపు టీఎస్‌ను టీజీగా మార్చడంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లమని, కొందరు యువకులు తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించుకున్నారని చెప్పారు.

“ఉద్యమ సమయంలో వాహనాలపై, బోర్డులపైన అందరం టీజీ అని రాసుకున్నాం. కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొంది. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం.” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news