ముస్లింలకు 4 % రిజర్వేషన్లు కొనసాగిస్తాం : సీఎం జగన్

-

చంద్రబాబు ఓ వైపు ఎన్డీఏలో కొనసాగుతూ మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు జత కట్టారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు కొనసాగిస్తాం. ఆరు నూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. దీనిపై నేను పోరాడుతానని.. NRC, CAA అంశాల్లో మైనార్టీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

CM Jagan

చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయి. నా హయాంలో అభివృద్ధి లేదని ప్రచారం చేస్తున్నారు. కొత్తగా 4 ఓడరేవులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఇవి చంద్రబాబుకు కనిపించడం లేదా..? నాడు-నేడుతో స్కూళ్లను అభివృద్ధి చేశాం. వాలంటీర్లతో పథకాలు చేరవేస్తున్నాం. మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news