అగ్గిపుల్ల, సబ్బుబిల్ల కాదేదీ జీఎస్టీకి అనర్హం అన్నట్లు చేసింది బీజేపీ : సీఎం రేవంత్

-

పదేళ్ల ఎన్డీఏ పాలన వైఫల్యంపై ఛార్జ్‌షీట్ విడుదల చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ కుట్రలపై ప్రజలకు వివరించాల్సి ఉందని తెలిపారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసగించారని మండిపడ్డారు. మూడు నల్లచట్టాలను తెచ్చి రైతులను బానిసలుగా చేసేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. కార్పొరేట్‌ కంపెనీలకు ఎన్డీఏ ప్రభుత్వం లొంగిపోయిందని విమర్శించారు.

“స్విస్‌ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి ప్రజలకు పంచుతామన్నారు. ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తాని మోసగించారు. చేనేత నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ విధించి దోపిడీ చేశారు. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కూడా జీఎస్టీకి అతీతం కాదని చాటి చెప్పారు. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల కూడా జీఎస్టీ బారి నుంచి తప్పించుకోలేదు. దేశాన్ని రూ.168 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారు. గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్లు అప్పులు చేశారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.113 లక్షల కోట్లు అప్పులు చేసింది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయరహదారులను కార్పొరేట్లకు కట్టబెట్టారు. కాంగ్రెస్‌ కూడబెట్టిన ఆస్తులను పదేళ్లలో కార్పొరేట్లకు అమ్మారు” అని సీఎం రేవంత్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news