రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

-

రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాజాగా గాంధీభవన్ లో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగం పై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదింపజేసేందుకు 400 సీట్లు కావాలని అడుగుతోంది.

ఆర్ఎస్ఎస్ అజెండాను బీజేపీ అమలు చేస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయాలని చూస్తోంది. రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. బీజేపీ ఎంతటి దురాగతానికైనా పాల్పడుతుందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా పదేళల్లో మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.. కానీ ప్రధాని మోడీ కేవలం 7లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. పదేళ్లలో మోడీ రూ.113 లక్షల కోట్లను అప్పు చేశారు. నయా భారతాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 2025 వరకు వంద సంవత్సరాలు పూర్తి అవుతుందని.. అందుకే రిజర్వేషన్లను రద్దు చేసేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news