రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం రేవంత్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

-

శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో దేశవ్యాప్తంగా ప్రజలంతా జరుపుకొంటారని అన్నారు. ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా ఈ పర్వదినం నిలుస్తోందని తెలిపారు. శ్రీరాముడి ఆదర్శప్రాయ జీవితం నుంచి స్ఫూర్తి పొందుదామని గవర్నర్‌ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. భద్రాచల క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ తెలిసేలా ఘనంగా నవమి వేడుకలు నిర్వహించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రజలకు శ్రీరామనవమి విషెస్ తెలిపారు. రాష్ట్రమంతా పాడిపంటలతో సుభిక్షంగా వెలుగొందేలా, అందరూ ఆనందంతో జీవించేలా సీతారాముల కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాలను అందరూ ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news