ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇక నాలుగో రోజు కూడా ఢిల్లీ పర్యటన లో సీఎం రేవంత్ ఉండబోతున్నారు. సాయంత్రం లేదా రేపు ఉదయం హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. నిన్న అర్ధరాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు డిప్యూటీ సీఎం భట్టి.
ఇది ఇలా ఉండగా…ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల పనులు, సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సీఎం బుధవారం దిల్లీలో కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఆర్ అండ్ బీ అధికారులు కూడా పాల్గొన్నారు.