తెలుగు రాష్ట్రాల కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

-

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఇద్దరికి అమాత్య యోగం వరించింది. సికింద్రాబాద్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ ఆదివారం కేంద్రమంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌; బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న ఈ ఐదుగురికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా వారిని కోరారు. మరోవైపు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన నరేంద్రమోదీకి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news