తెలంగాణ కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదని…. తెలంగాణలో ఏ శాఖా ఖాళీగా లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఊహాజనిత ప్రచారంతో గందరగోళం సృష్టిస్తున్నారు. విద్యాశాఖ నా దగ్గరే ఉంది.. ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. విద్యాశాఖపై ఎన్నో సమీక్షలు చేశాను. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ ఒక్కడే ప్రమాణస్వీకారం చేసి కొన్ని నెలలపాటు మంత్రులను పెట్టుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఇవాళ జీవన్ రెడ్డితో సమావేశం అయిన తర్వాత ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…రెండు మూడు రోజులుగా తెలంగాణ లో , కాంగ్రెస్, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు….వివిధ అంశాలపై మీడియా లో వార్తలు వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఇవాళ జీవన్ రెడ్డితో సమావేశం అయిన తర్వాత ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…రెండు మూడు రోజులుగా తెలంగాణ లో , కాంగ్రెస్, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు….వివిధ అంశాలపై మీడియా లో వార్తలు వస్తున్నాయని తెలిపారు.