సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణకు కొత్త పోలీసు బాస్ గా జితేందర్ నియామకం

-

సీఎం రేవంత్ రెడ్డి పోలీసుశాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ డీజీపీని  మార్చింది.  ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన జితేందర్ రెడ్డిని, తెలంగాణ పోలీసు బాస్ గా నియమించింది. ఇప్పటికే అన్నిరకాల అధికారిక ఫార్మాలిటీస్ పూర్తి  చేసుకొని తెలంగాణ డీజీపీగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్త ను హోం శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న.. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అధికారిక ఉత్తర్వులు వెలువడటానికి కాస్త ఆలస్యమైందంట.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు-తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ తరువాత పోలీస్ బాస్ ను మార్చడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీగా గా జితేందర్ కావడం విశేషం.  ప్రస్తుతం డీజీపీ హోదాలో  జితేందర్..  హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news