తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపై సీఎంవో స్పందించింది. సీఎం ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది.
ఇక సీఎం రేవంత్ తీవ్ర గొంతు నొప్పితో బాధపడుతున్నారని, అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరమయ్యారని ప్రచారం జరిగింది. అంతేకాదు మరికొందరు సీఎం రేవంత్‌కు జ్వరం వచ్చిందని, కరోనా టెస్ట్ చేశారంటూ న్యూస్ క్రియేట్ చేశారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన స్పందించిన సీఎంవో ఈ ప్రచారాలన్నింటిని ఖండించింది. సీఎం ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. అలాగే ఇవాళ మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ రేవంత్‌ని కలిసిన పలు అంశాలపై చర్చించినట్లు స్పష్టం చేసింది. మరోవైపు నిన్న సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశానికి 10 నిమిషాల ముందే హాజరైనట్టు సమాచారం. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించాలనుకున్నారు. కానీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది.