ఇక నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు

-

ముఖ్యమంత్రి సహాయ నిధి- సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే  స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  దరఖాస్తుల కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈనెల 15వ తేదీ నుంచి  ఈ వెబ్‌సైట్‌ ద్వారానే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో పారదర్శకతతో నిర్వహించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ చెప్పారు.

సీఎంఆర్ఎఫ్ కు ఎలా అప్లై చేయాలంటే..

ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. CMRF కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు దారుల బ్యాంక్ ఖాతాను తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత CMRFకు సంబంధించిన ఒక కోడ్ కేటాయిస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే CMRF దరఖాస్తును ఆమోదించి చెక్‌ను సిద్ధం చేస్తారు. చెక్కు పక్కదారి పట్టే అవకాశం లేకుండా.. దానిపై దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్‌ను ముద్రిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news