ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్హా నియామకం అయ్యారు. ఈ మేరకు చంద్రబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలివైన లడ్హా….ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్హా నియామకం అయ్యారు. కేంద్రంలో సీఆర్పీఎఫ్ డీజీగా విధులు నిర్వహించిన లడ్హాను నియామకం చేశారు చంద్రబాబు.
ఇక అటు 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు… తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు వెల్లడించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్‌లైన్ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగాయని తెలిపారు.