రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు కమిటీ ఏర్పాటు

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు ధూంధాంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలోనూ ఈ అంశంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 21 రోజులు రాష్ట్రంలో ఈ వేడుకలు దద్దరిల్లాలలని నేతలకు సూచించారు. తెలంగాణ గతంలో ఎలా ఉండేదో.. ఇప్పుడెలా ఉందో ప్రజలకు వివరించాలన్నారు. చేసిన పనిని వెయ్యి గొంతుకలతో చెప్పుకోవాలన్నారు. ఉద్యమ సమయంలో తాను చెప్పినట్లుగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించిందన్నారు.

ఈ క్రమంలోనే ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్న వేడుకల నిర్వహణకు ప్రభుత్వం కమిటీని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. సమాచార పౌరసంబంధాల స్పెషల్‌ కమిషనర్‌ కె.అశోక్‌రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news