తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇంటింటికీ ఎన్యుమరేటర్లు వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఈ నేథప్యంలోనే నడి రోడ్డు పై సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు పడిపోయాయి. దీంతో మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ట్వీట్ చేశారు. నాడు ప్రజా పాలన దరఖాస్తులు.. నేడు సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు నడిరోడ్డుకు వచ్చాయని కామెంట్ చేశారు.
ప్రజల వివరాలను సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్దికి ఇది మరో నిదర్శనమని పేర్కొన్నారు. రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్ట బయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యమా అని ప్రశ్నించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వేలో ఇచ్చిన వివరాలను భద్రతా డొల్ల అని స్పష్టమవుతోందని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు సైబర్ మోసాగాళ్ల చేతికి చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటని ఫైర్ అయ్యారు.