రీజనల్ రింగ్ రోడ్డు పనుల వేగవంతంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండున్నరేళ్ల క్రితం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మరో 50 శాతం నిధులు సాగరమాల కింద కేటాయించి రీజనల్ రింగ్ రోడ్డు పనులను శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్డు పనుల వేగవంతంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందే RRR కింద గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేసారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా RRR పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం RRR టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టిందని అక్కడక్కడ ఉన్న భూసేకరణ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.