తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అసెంబ్లీ సమావేశాలు పొడగింపు..

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల పొడగింపు పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను ఆగస్టు 02వ తేదీ వరకు పొడగించింది. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు ఆరోపణలతో సభ హోరెత్తింది. ఈ తరుణంలోనే అసెంబ్లీ సమావేశాలను పొడగిస్తూ.. నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆగస్టు 02వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.

సభలో 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేసీఆర్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. 26వ తేదీ సెలవు ఉండటంతో 27న బడ్జెట్ పై సాధారణ చర్చతో పాటు డిప్యూటీ సీఎం సమాధానం ఉండనుంది. తరువాత 28వ తేదీ మరో సెలవు ఉంది. ఈనెల 29న 19 పద్దులపై చర్చతో పాటు ఆమోదం కూడా ఆరోజే ఉండనుంది. 30న మరో 19 పద్దులపై చర్చించి.. ఆమోదం తెలుపనున్నారు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ, ఆమోదం జరగనున్నాయి. ఆగస్టు 1, 2 తేదీల్లో ప్రభుత్వ అజెండా, బిల్లులపై చర్చించనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news