సీఎం అభ్యర్థి ఎంపికపై కొలిక్కిరాని చర్చలు.. ఇవాళ ప్రమాణ స్వీకారం లేనట్టే

-

తెలంగాణలో స్పష్టమైన మెజార్టీ దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉంది. అయితే ఈ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరవుతారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ సమావేశమై.. సీఎం అభ్యర్థి, మంత్రివర్గం ఎంపికపై చర్చించారు. చివరకు ఆ నిర్ణయాన్ని అధిష్ఠానానికే వదిలేశారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ విషయంపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ప్రకటన రాకపోవడంతో ఇవాళ ప్రమాణ స్వీకారం లేనట్టే కనిపిస్తోందని అంతా భావిస్తున్నారు.

- Advertisement -

మరోవైపు సీఎల్పీ నేత ఎంపికపై అధిష్ఠానంతో చర్చించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ దిల్లీకి వెళ్లారు. అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చాకే గవర్నర్‌ను కాంగ్రెస్‌ నేతలు కలవనున్నట్టు సమాచారం. అప్పుడే సీఎం ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్ఠానం నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...