మరోసారి తన నిజస్వరూపం బయటపెట్టుకున్న కాంగ్రెస్ : కిషన్ రెడ్డి

-

ప్రజలను మోసంచేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపం బయటపడిందని కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డి  విమర్శించారు. గ్రూప్‌-1 పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1న నిరుద్యోగ యువతకోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని.. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటి పేజీలో కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చిందన్నారు.

మరి ఫిబ్రవరి ఒకటో తేదీ గడచిపోయిందని.. ఇవాళ ఫిబ్రవరి 02వ తేదీ అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయిందని చెప్పారు. గ్రూప్‌-1కు సంబంధించి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదని విమర్శించారు. హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన.. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. నమ్మి ఓటు వేసిన తెలంగాణ యువతను నిట్ట నిలువునా మోసం చేసింది. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ కూడా వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోందని కిషన్ రెడ్డి  పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news