పాలమూరు బిడ్డను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ దే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సోనియాగాంధీతోనే తెలంగాణ కల సాకారమైంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం మేము అడిగిన నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తాం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరీ ప్రజలకు అంత మంచిది కాదు అన్నారు.
మన మర్యాద మన రాష్ట్రానికి మేలు జరగాలనే అని సీఎం తెలిపారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మోడీతో అయినా.. కేడీతో అయినా కొట్లాడతానని తెలిపారు. పదేళ్లలో తెలంగాణను లూటీ చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కానీ.. మందు వేసుకొని ఫామ్ హౌస్ లో కూర్చున్నాడని రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరులో విద్య, వైద్యం, ఉపాధి, ప్రాజెక్టుల కోసం ప్రతీ నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత నాది. రేపు చావే వస్తే.. పాలమూరు మట్టిలో కలిసే బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.