Telangana Elections : కామారెడ్డి నుంచి రేవంత్‌.. కాంగ్రెస్‌ మూడో జాబితా ఇదే

-

BREAKING : తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. ఏకంగా 16 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండగా…నిజామాబాద్ అర్బన్ కు షబ్బీర్ అలీ బదిలీ అయ్యారు. చెన్నూరు నుంచి మాజీ ఎంపీ జి. వివేక్ బరిలో ఉన్నారు.

congress

ఇది వరకు ప్రకటించిన బోథ్ స్థానంలో అభ్యర్థిని మార్చింది కాంగ్రెస్ పార్టీ. వనపర్తి అభ్యర్థిని సైతం మార్చింది కాంగ్రెస్. చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మరోసారి కేకే మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పటాన్‌చెరు నుంచి నీలం మధు ముదిరాజ్, నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్ బరిలో ఉన్నారు.

కాంగ్రెస్‌ మూడో జాబితా ఇదే

  • చెన్నూరు- వివేకానంద్,
  • బోథ్ – ఆడే గజేందర్‌,
  • జుక్కల్-తోట లక్ష్మీకాంతా రావు,
  • బాన్సువాడ-ఏనుగు రవీందర్‌ రెడ్డి,
  • కామారెడ్డి- రేవంత్ రెడ్డి,
  • నిజామాబాద్‌ అర్బన్- మహ్మద్ షబ్బీర్ అలీ,
  • కరీంనగర్‌-పురుమల్ల శ్రీనివాస్,
  • సిరిసిల్ల- కొందం కరుణ మహేందర్ రెడ్డి,
  • నారాయణఖేడ్- సురేశ్ కుమార్‌ షెట్కార్..
  • పటాన్‌చెరు-నీలం మధు ముదిరాజ్,
  • వనపర్తి- తుడి మేఘారెడ్డి,
  • డోర్నకల్‌-జాటోత్, రామచంద్రు నాయక్..
  • ఇల్లందు-కోరం కనకయ్య,
  • వైరా-రాందాస్ మాలోత్,
  • సత్తుపల్లి-మట్టా రాగమయి,
  • అశ్వారావు పేట- జారె ఆదినారాయణ

Read more RELATED
Recommended to you

Latest news