WORLD CUP 2023: ఆ 2 సెమీస్ స్థానాలపై పెరుగుతున్న ఉత్కంఠ !

-

ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ రకరకాల మలుపులు తీసుకుంటూ చివరి దశకు చేరుకుంటోంది. పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఇప్పటికే అధికారికంగా రెండు జట్లు సెమీస్ కు దూరంగా, అనధికారికంగా మరో రెండు జట్లు దూరం అయ్యాయి. సెమీస్ కు చేరడానికి నాలుగు జట్లకు మాత్రమే అవకాశం ఉండగా ఇప్పటికే ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా లు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం మొత్తం నాలుగు జట్లు బరిలో ఉన్నాయని చెప్పాలి. అందులో న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ లు ఉన్నాయి. ఎక్కువ శాతం ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ లకే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఆఫ్ఘన్ మరియు ఆస్ట్రేలియాలకు రెండు మ్యాచ్ లు ఉండగా, ఆసీస్ ఒకటి గెలిస్తే సెమీస్ చేరుతుంది,

ఆఫ్ఘన్ మాత్రమే రెండూ గెలవాలి, లేదా ఒకటి గెలిస్తే భారీగా రన్ రేట్ ను బిల్డ్ అప్ చేసుకోవాలి. ఇక మిగిలిన పాక్, కివీస్ లకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. ఈ రెండూ భారీ తేడాతో గెలిస్తే మరో సెమీస్ బెర్త్ ను కైవసం చేసుకుంటుంది. మరి ఈ సెమీస్ కు చేరే 2 జట్లు ఏవో తెలియాలంటే కొన్ని మ్యాచ్ ల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news