భద్రాద్రి సీతారాముల కల్యాణం లైవ్ స్ట్రీమింగ్కు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరిన కాంగ్రెస్

-

భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రతి ఏడాది ఈ కల్యాణోత్సవం ఆనవాయితీగా జరిగేదేనని పేర్కొంది. ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నో ఏళ్లుగా ఈ కల్యాణోత్సవాన్ని భక్తులు టీవీల్లో వీక్షిస్తున్నారని తెలిపింది. స్వయంగా ఆలయానికి రాలేని వారంతా టీవీల్లో సీతారాముల కల్యాణాన్ని వీక్షించి తరిస్తారని ఈసీకి వివరించింది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రత్యక్షప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న కల్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏడాది మాదిరిగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతివ్వాలని దేవాదాయ శాఖ ఇప్పటికే ఈసీకి లేఖ రాసింది. ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ఈసీ ఈ నెల 4న ప్రభుత్వానికి స్పష్టం చేయగా.. కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారంపై మరోసారి పరిశీలించి, అనుమతివ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news