హరీష్ రావు వచ్చినందుకు యాదాద్రిని శుద్ది చెసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

-

హరీష్ రావు యాదాద్రి టూర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయనపై ఆలయ ఈఓ భాస్కర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అధికారుల అనుమతి లేకుండానే యాదాద్రిలో బయటి పూజారుల చేత పూజ చేయించినందుకు హరీష్ రావు పైనా అలాగే ఆ పూజలో పాల్గొన BRS లీడర్ల పైన పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఇప్పుడు హరీష్ రావు వచ్చినందుకు యాదాద్రి అపవిత్రం అయ్యిందని నీళ్లతో శుభ్రం చేసారు కాంగ్రెస్ ఎమ్మెల్యే.

రేవంత్ రెడ్డి దువ్వులపైన ఓట్లు పెట్టడంతో ఆ పాపం తెలంగాణ ప్రజలకు అంతకుడదని హరీష్ రావ్ యాదాద్రిలో పూజలు చేస్తే.. ఆయన వచ్చినందుకు యాదగిరిగుట్ట పైన ఆలయ పరిసరాలను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నీటితో శుభ్రం చేసారు. కొండా పైన హరీష్ రావు సంకల్పం చేయడంతో యాదాద్రి అపవిత్రం అయ్యిందని.. ప్రధానా ఆలయ ప్రాంగణం అలాగే మాడ వీధులను నీళ్లతో కడిగారు బీర్ల ఐలయ్య కాంగ్రెస్ నాయకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version