అనధికారిక లే అవుట్ల మీద ఏపీ మున్సిపల్ శాఖ కొరడా..!

-

అనధికారిక లే అవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లే అవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాల్టీల్లో ఉన్న లే అవుట్లల్లో 50 శాతం మేర అనధికారిక లే అవుట్లు ఉన్నాయని మున్సిపల్ శాఖ అంచనా వేస్తుంది. అటువంటి అనధికారిక లే అవుట్ల ముందు బోర్డులు పెట్టాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ఇప్పటికే వివిధ మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లే అవుట్ల సమాచారాన్ని ప్రకటనల రూపంలో వెల్లడిస్తుంది మున్సిపల్ శాఖ. అనధికారిక లే అవుట్లపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం అంటుంది మున్సిపల్ శాఖ. అయితే మున్సిపాల్టీల్లోని అనధికారిక లే అవుట్లతో పాటు వివిధ అర్బన్ అథార్టీల్లోని వేసిన అనధికారిక లే అవుట్ల మీద కూడా మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టింది. అర్బన్ అథార్టీల పరిధిలో 50 శాతానికి మించి అనధికారిక లే అవుట్లు ఉంటాయని మున్సిపల్ శాఖ అంచనా వేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version