అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా రేవంత్ రెడ్డి ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అప్పుడే రేపు తెల్లవారుజామున నుంచి రైతు భరోసా అన్నాడు. వెంటనే మార్చి 31 అని మాట మార్చిండు రేవంత్ రెడ్డి. తెలివిగా మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో మాత్రం చెప్పలేదు.
మరోవైపు అహా నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరెడ్డిలా రేవంత్ రెడ్డి పాలన ఉందని సినిమాలతో పోల్చాడు కేటీఆర్. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటుంటే నవ్వు వస్తుంది.2021 జులై 26 నాడు స్వయంగా భట్టి విక్రమార్క ఆయన సొంత నియోజకవర్గంలోనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఫోటో దిగాడు. బీఆర్ఎస్ హయాంలో 6లక్షల 50వేల వరకు రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు.
అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా రేవంత్ రెడ్డి ఉన్నాడు
అప్పుడే రేపు తెల్లవారు నుండి రైతు భరోసా అన్నాడు.. వెంటనే మార్చి 31 అని మాట మార్చిండు
రేవంత్ రెడ్డి తెలివిగా మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలేదు – కేటీఆర్ https://t.co/2RBpx8XESy pic.twitter.com/k2HNibABpF
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025