తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. నిన్న సాయంత్రం వరకు క్యూ లైన్ లో ఉండి మరీ ఓటు వేశారు తెలంగాణ ఓటర్లు. అయితే పోలింగ్ పూర్తి కాగానే.. అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ప్రకటించాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో అనూహ్య ఫలితాలు రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లేని విధంగా హంగు వాతావరణం కూడా నెలకొంది. కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇస్తే.. మరికొన్ని మాత్రం భారత రాష్ట్ర సమితి పార్టీకి మరోసారి అధికారాన్ని కట్టబెట్టాయి.
అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోయాయి. టైట్ సిట్యుయేషన్ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను బెంగళూరుకు తరలించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణలో ఉంటే నేతలు ప్రలోభాలకు గురి అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బెంగళూరుకు కాంగ్రెస్ అభ్యర్థులను తరలించేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తుండట. డీకే శివకుమార్ నేతృత్వంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండనున్నట్లు తెలుస్తోంది.