కేటీఆర్‌ పరనింద నుంచి బయటకు రాకపోతే ప్రతిపక్ష స్థానం కూడా దక్కదు : జీవన్ రెడ్డి

-

బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటకు రావాలని అన్నారు. అలా జరగకపోతే బీఆర్ఎస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష స్థానం దక్కదని విమర్శించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

మిత్రపక్షంగా భావించే రాజకీయ పార్టీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా తేరుకుని వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించి ప్రతిపక్ష స్థానం నిలబెట్టుకోవాలని సూచించారు. తప్పుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు పడ్డాయని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు. అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచే వాళ్లం అని బీఆర్ఎస్ పార్టీ అంటోందని.. మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. అధినాయకుడు కేసీఆర్ను అని జీవన్‌ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news