BREAKING: రేవంత్ రెడ్డి అనుచరుడిపై 8 మంది దాడి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పై దాడి జరిగింది. హైదరాబాద్ లోని అన్నోజిగూడ డి మార్ట్ వద్ద కాంగ్రెస్ నేత సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి చోటు చేసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పై 8 మంది దాడికి పాల్పడ్డారు. ఇక దీంతో ప్రస్తుతం శ్రీకర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు శ్రీకాంత్ రెడ్డి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.