తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే

-

ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అన్నివర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని వెల్లడించారు. పాంచ్ న్యాయ్‌.. పచ్చీస్ గ్యారంటీలో భాగంగా మేనిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందిని.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటామని వివరించారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు ఇవే..

 

అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు

మేడారం జాతరకు జాతీయ హోదా

గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ప్రారంభం

భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం

4 సైనిక పాఠశాలలు ఏర్పాటు

కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు

కేంద్ర నిధులు నేరుగా స్థానిక సంస్థలకు అందేలా చూడటం

సౌరశక్తి ఉత్పత్తి ప్రోత్సాహం

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం

రాష్ట్రంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు

రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైను ఏర్పాటు

రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు

Read more RELATED
Recommended to you

Latest news