నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో వరికొయ్యలు కాల్చేందుకు నిప్పు పెట్టిన ఓ రైతు ఆ మంటల్లో చిక్కుకుని మరణించాడు. ఈ ఘటన సిరికొండ మండలం పోతునూరులో జరిగింది. మృతుడు పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన కిషన్ రావుగా గుర్తించారు. కిషన్ మృతితో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనతో పోతునూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతునూరు గ్రామానికి చెందిన రైతు కిషన్కు సంబంధించిన పొలంలో వరి కోతలు పూర్తయ్యాయి. ధాన్యం కూడా అమ్మడంతో ఇక మరో పంటకు పొలం సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగాడు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం పూట వరికొయ్యలను కాల్చేద్దామని పొలానికి బయల్దేరాడు. ఒంటరిగా పొలానికి వెళ్లిన కిషన్.. తనకున్న పొలంలో ఓ మడిలోని వరికొయ్యలకు నిప్పు పెట్టాడు. అయితే వడగాల్పుల వల్ల ఆ మంటలు వేగంగా ఇతర మడుల్లోకి వ్యాపించాయి. ఇక కిషన్ ఉన్న మడిలో ఆయన చుట్టూ దట్టంగా వ్యాపించాయి. ఈ క్రమంలో మంటల మధ్య చిక్కుకున్న కిషన్కు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. L