జేసీ దివాకర్ రెడ్డి హత్యకు కుట్ర.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తాడిపత్రి: మునిసిపల్ చైర్ పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డి – ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య వైరం గురించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది. తాడిపత్రి మునిసిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నారని గత రెండు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమాలపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరి మీడియాకు వివరించారు.

అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. తన కుమారుడిని ఎమ్మెల్యే చేసుకునేందుకు జెసి దివాకర్ హత్యకు జెసి ప్రభాకర్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు పెద్దారెడ్డి. బెడ్ పై ఉన్న ఆయన సోదరిని చంపాలనుకున్నారని.. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ని కూడా చంపి సానుభూతితో తన కొడుకుని ఎమ్మెల్యే చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news